టీఆర్ఎస్ మేనిఫేస్టో ఎందుకు పనికిరాదని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. టీఆర్ఎస్ మేనిఫేస్టోను చెత్త బుట్టలో పడేసి టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దుబ్బాకలో బీజేపీ విజయంతో కేసీఆర్‌కు భయంపట్టుకుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మద్ధతు వల్లే మజ్లీస్ బలపడుతుందని ఆయన అన్నారు. ప్రజల్లో భయాలు సృష్టించి ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. దేశ వ్యతిరేకులు రాసిచ్చిన స్క్రిప్టును కేసీఆర్, కేటీఆర్ చదువుతున్నారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాష్టంలో కనుమరుగవుతుందని ఆయన అన్నారు.
For More News..