గ్రేస్​ మార్కులు కొందరికేనా : మహేందర్​

హైదరాబాద్, వెలుగు: అటానమస్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో కొందరు విద్యార్థులకు మాత్రమే గ్రేస్​మార్కులు కలిపి పాస్​చేసి మరికొందరికి మాత్రం కలపలేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్​ తెలిపారు. గురువారం ఆయన పలువురు ఇంజినీరింగ్​విద్యార్థులతో  ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీరామ్​ వెంకటేశ్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

స్టూడెంట్లందరికి గ్రేస్​ మార్కులు కలిపి న్యాయం చేయాలని కోరారు. జేఎన్టీయూ ఇచ్చిన గెజిట్​ను కొన్ని కాలేజీలకు వర్తింపజేసి మరికొన్నింటికి వర్తింపజేయక పోవడంపై ఇంజినీరింగ్​ విద్యా ర్థులు మండిపడుతున్నారని తెలి పారు. ఇప్పడు ఆ గెజిట్ ను​రద్దు చేస్తున్నామని చెప్పడంతో 700 మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.