వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి : మాదగోని శ్రీనివాస్​గౌడ్​ 

నల్గొండ అర్బన్, వెలుగు:  ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్​గౌడ్​ పిలుపునిచ్చారు.  ఆదివారం పట్టణంలోని పానగల్‌ పచ్చల సోమేశ్వరాలయంలో పూజలు చేసి గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  పట్టణంలోని 1, 2 వార్డుల్లో తిరిగి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

అంతకు ముందు శ్రీనివాస్​గౌడ్​కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,  రేషన్‌తో పాటు రాష్ట్రంలో అమలయ్యే అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తామే ఖర్చుపెడుతున్నట్లు చెప్పుకుంటోందని మండిపడ్డారు.

ప్రజలు బీఆర్‌‌ఎస్‌ మోసాలను గుర్తించి.. బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు వీరెళ్లి చంద్రశేఖర్​, జిల్లా కార్యదర్శి పోతెపాక సాంబయ్య, మండలాధ్యక్షుడు దాయం భూపాల్​రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేవ్, నేవెర్సు నీరజ, గాలి శ్రీనివాస్​, తదితరులు ఉన్నారు.