కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వినతి
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ఆగిపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి కోరారు. ఎన్‌హెచ్ 44కు వెళ్లడానికి రైల్వే గేట్ వద్ద అదనంగా మరో ఫ్లై ఓవర్‌ను మంజూరు చేయాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో గురువారం జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డికి ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కిషన్‌రెడ్డి పనులను పూర్తి చేయాలని రైల్వే జీఎంను ఆదేశించినట్లు శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.