కొత్తపల్లి, వెలుగు : రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకుడు వాసాల రమేశ్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కెంచ శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల వర్షానికి ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లు తడిసి ముద్దాయ్యాయని, తడిసిన ధాన్యాన్ని తాలు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు.
ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, రుణమాఫీ రూ.2 లక్షలు వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎర్రోళ్ల ప్రదీప్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కొప్పుల హరిప్రసాద్, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు ఉమ్మెంతల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.