హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తారని కొన్ని రోజులుగా మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నా యని, ఆయనను ఎందుకు మారుస్తున్నారనే విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై ఉందని మాజీ ఎంపీ విజయశాంతి ప్రకటన విడుదల చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల వరకు పార్టీ అధ్యక్షుడి మార్పు లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఇటీవలే స్పష్టం చేశారని, అయినా సంజయ్‌ను మారుస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.