అప్పుడు ఉద్యమకారులైతే.. ఇప్పుడు ఉగ్ర‌వాదులా?

అప్పుడు ఉద్యమకారులైతే.. ఇప్పుడు  ఉగ్ర‌వాదులా?

తెలంగాణ స‌ర్కార్ ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. ప్ర‌శ్నించే గొంతంటే కేసీఆర్‌కు న‌చ్చ‌దని.. వారిని ఎలాగైనా నోరు మెదప‌కుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైన చేస్తాడని ఆమె విమర్శించారు. 317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు... టీఆర్ఎస్ నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఉద్య‌మంలో ఉద్యోగుల కోసం ఎంతో చేస్తాన‌ని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్... అధికారంలోకి వ‌చ్చాక వారిని పట్టించుకున్న పాపాన పొలేదని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ సాధ‌న‌లో ఉద్యోగులు ఉద్యమకార్లలా కన్పిస్తే... ఇప్పుడేమో ఉగ్ర‌వాదుల్ల క‌నిపిస్తున్నరా? అని ప్రశ్నించారు. జీవో 317 వ‌ల్ల తమకు ఆన్యాయం జ‌రుగుతుంద‌ని... న్యాయం చేయమని ఉద్యోగులు ఎంత మొరపెట్టుకున్న‌ా కేసీఆర్ దొర‌వారికి మాత్రం వినబడటం లేదని విజయశాంతి అన్నారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలంగాణను సాధించుకున్నమో... అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం... ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన బాధాకరమని ఆమె వాపోయారు. రాష్ట్రం వచ్చినంక ఎట్లాంటి సమస్యలుండవని ఆశిస్తే... గత పాలకులకన్నా కేసీఆర్ నిరంకుశ పాల‌న చేస్తుండని అన్నారు. ఈపాల‌న‌కు రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే ముగింపు ప‌లుకుతారని విజయశాంతి అన్నారు.

 

తెలంగాణ స‌ర్కార్ ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోంది. జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను రాత్రికి రాత్రే ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతం?... ప్ర‌శ్నించే గొంతంటే కేసీఆర్‌కు న‌చ్చ‌దు. వారిని ఎలాగైనా నోరు మెదప‌కుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైన చేస్తాడు. 317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు... టీఆర్ఎస్ నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనం. ఉద్య‌మంలో ఉద్యోగుల కోసం ఎంతో చేస్తాన‌ని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్... అధికారంలోకి వ‌చ్చాక వారిని పట్టించుకున్న పాపాన పొలేదు. కేసీఆర్‌కు తెలంగాణ సాధ‌న‌లో ఉద్యోగులు ఉద్యమకార్లల్ల కన్పిస్తే... ఇప్పుడేమో ఉగ్ర‌వాదుల్ల క‌నిపిస్తున్నరా?... జీవో 317 వ‌ల్ల తమకు ఆన్యాయం జ‌రుగుతుంద‌ని... న్యాయం చెయ్యమ‌ని ఉద్యోగులు ఎంత మొరపెట్టుకున్న‌ా కేసీఆర్ దొర‌వారికి మాత్రం వినబడటం లేదు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలంగాణను సాధించుకున్నమో... అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన బాధాకరం. రాష్ట్రం వొచ్చినంక ఎట్లాంటి సమస్యలుండవని ఆశిస్తే... గత పాలకులకన్నా కేసీఆర్ నిరంకుశ పాల‌న చేస్తుండ్రు. ఈపాల‌న‌కు రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే ముగింపు ప‌లుకుతారు. విజయశాంతి

Posted by Vijayashanthi on Thursday, February 10, 2022

For More News..

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్