పిరికితనం వద్దు.. ఎదురు తిరగండి

పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కానీ ఇవాళ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి... పెంచి పెద్ద చేస్తారన్నారు. అలాంటి పిల్లలు ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు పోరాటం చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన యువత... ఇవాళ ఉద్యోగం కోసం చనిపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రతీ సమస్యకు అనేక పోరాటాలన్నారు. పిరికితనం కాదు ఎదురు తిరగాలన్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడాలన్నారు. 

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్ల పాటు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు ఇవ్వాలన్నారు. కానీ జీతాలు ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని విమర్శించారు విజయశాంతి. మీ కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాడాలన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ చేయమని నేను అడగడం లేదు కానీ.. ఓ గంట పాటు నిరుద్యోగాల కోసం గొంతు విప్పాలన్నారు రాములమ్మ. మీ తమ్ముళ్లకు ధైర్యం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే ధైర్యం సత్తా యువతకు ఉందన్నారు. మీకోసం భారతీయ జనతా పార్టీ ఉందన్నారు విజయశాంతి. 

ఇవి కూడా చదవండి:

ఏడేళ్ల పాటు ఏం చేశారు?

రచ్చబండ రచ్చ రచ్చ.. రేవంత్ రెడ్డి అరెస్ట్