ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. సోమవారం ( జనవరి 28, 2025 ) కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గద్దర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్‌రెడ్డి.. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు విష్ణు వర్ధన్ రెడ్డి.
గద్దర్ మావోయిస్టుకు చెందిన లీడర్ అని.. అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తిరగలేనంటూ రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాశారని అన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా రేవంత్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి.
Also Read : బీజేపీ, కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్.!
మాజీ మావోయిస్టు, రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదాలో సీఎం రేవంత్ పద్మ అవార్డు అడుగుతున్నారని, ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వారు సీఎం రేవంత్‌కు సలహాలు ఇస్తున్నారని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.