హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం కేబినెట్ మంత్రి పదవిని త్యాగం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద వారి చిత్రపటానికి వివేక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ సాధనకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు అనేక సేవలందించి.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడు కొండా బాపూజీ అని వివేక్ అన్నారు. యువత మొత్తం కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్ర సమర యోధుడు"శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ"గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు వుండకొండ శ్రీధర గారు పాల్గొన్నారు.#kondaLaxmanPapuji pic.twitter.com/t3GOgjs0wb
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) September 27, 2021
For More News..