కేంద్రమంత్రి కైలాష్ చౌదరిని కలిసిన వివేక్ 

కేంద్రమంత్రి కైలాష్ చౌదరిని కలిసిన వివేక్ 
  • కేంద్రమంత్రి కైలాష్ చౌదరిని కలిసిన వివేక్ 
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ కష్టాలను తీర్చండి

ఢిల్లీ: కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి. గురువారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కైలాస్ చౌదరిని కలిశారు చెన్నూరు నియోజక వర్గం రైతుల బృందం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునుగుతోన్న పంట పొలాలపై రైతుల గోసను కైలాష్ చౌదరికి వివరించారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు, మంథని నియోజక వర్గంలో 40 వేల ఎకరాలు ముంపుకు గురవుతోన్నాయని  మంత్రి దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు వివేక్ వెంకటస్వామి. రైతుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి కైలాణ్ చౌదరి..రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని చెప్పారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి భరోసా ఇచ్చారని తెలిపారు వివేక్ వెంకటస్వామి.