కేసీఆర్‌కు బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ సవాల్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌కు దమ్ముంటే దుబ్బాక బై ఎలక్షన్స్‌లో డబ్బులు పంచకుండా గెలవగలమని స్టేట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి సవాల్ విసిరారు. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్ కేవలం డబ్బులు పంచి మాత్రమే గెలవగలదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ పోలీసులతో కేసీఆర్ డబ్బులు పంపిణీ చేయించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో టీఆర్ఎస్ క్యాండిడేట్‌తో రూ.20 కోట్లు పంపిణీ చేయించారని ఆరోపించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న కమీషన్ డబ్బులేనన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేశారు.
భయపెట్టి గెలవాలని చూస్తున్నరు
దుబ్బాక బీజేపీ క్యాండిడేట్ రఘునందన్‌రావుపై పోలీసుల తీరును వివేక్‌వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. రాత్రి పూట బీజేపీ లీడర్ కారు ఆపి చెకింగ్ పేరుతో 9 గంటల పాటు వెయిట్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రఘునందన్ మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, పోలీసులతో భయపెట్టి గెలవాలని చూస్తున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ మీద కేంద్రం కన్నేసి ఉంచిందని, తుగ్లక్ తరహా పాలనాతీరును గమనిస్తోందన్నారు. సరైన సమయంలో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఒక్కో ఫ్యామిలీకి రూ.30 వేలు ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఇవ్వాలని వివేక్ డిమాండ్ చేశారు.
For More News..