కేసీఆర్ ​హామీలు ఎటు పోయినయ్‌‌‌‌‌‌‌‌: వివేక్

కేసీఆర్ ​హామీలు ఎటు పోయినయ్‌‌‌‌‌‌‌‌: వివేక్

చండూరు, వెలుగు: దేశవ్యాప్తంగా ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా ముఖ్యమంత్రులు ప్రచారం చేయలేదని, ఓడిపోతామని భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారని బీజేపీ నేత, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్​ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం నియోజకవర్గంలోని చండూరులో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలడిగి తెలుసుకున్నారు. తమ తండ్రిగారైన వెంకటస్వామి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికుల కోసం అనేక స్కీములు తీసుకువచ్చి ఆదుకున్నారన్నారు. కరోనా టైంలో కేంద్రంలోని మోడీ సర్కారు దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసిందని, వ్యాక్సిన్ కూడా ఫ్రీగానే ఇచ్చిందన్నారు. శ్రీలంక ప్రధాని రాజపక్ష శ్రీలంకను దోచుకున్నట్టు.. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.  

కేసీఆర్ ​హామీలు ఎటు పోయినయ్‌‌‌‌‌‌‌‌

మునుగోడు: మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని వివేక్ వెంకటస్వామి కోరారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గతంలో ఇచ్చిన హామీల లిస్టుతో తెలంగాణ ‌‌‌‌‌‌‌‌ప్రజా వేదిక జనరల్ సెక్రెటరీ కప్పర ప్రసాదరావు రూపొందించిన పాంప్లెంట్‌‌‌‌‌‌‌‌ను బుధవారం మునుగోడులోని రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, గురుకులాల్లో పౌష్టికాహారం, నియోజకవర్గానికో సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ స్కీమ్ అమలు‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలీసులను సైతం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కంకణాల నివేదిత, లక్ష్మి పాల్గొన్నారు.