జాతీయ జెండాను ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి 

నల్లగొండ జిల్లా మునుగోడులోని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.