కొడుకును తర్వాత సీఎం చేసుకో ముందు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు

  • కేసీఆర్ పై మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్‌‌ కోర్‌‌ కమిటీ మెంబర్‌‌ వివేక్‌‌ వెంకటస్వామి ఫైర్​
  • ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నరు
  • దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వట్లే
  • ఎస్సీలపై వ్యతిరేకతతోనే అమలు చేయట్లేదని మండిపాటు
  • ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నరు
  • దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వట్లే
  • ఎస్సీలపై వ్యతిరేకతతోనే అమలు చేయట్లేదని ఆరోపణలు

గోదావరిఖని, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి సీఎం అయిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ముందుగా వాటిని అమలు చేయాలని, ఆ తర్వాతే కొడుకును సీఎం చేసుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌ వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన గోదావరిఖని, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాముత్తారం, మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఎస్సీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ బాగా అమలు చేస్తామని, ఎస్సీలు బాగుపడతారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారని చెప్పారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయిండని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇప్పటి వరకు 10 వేల మందికి మాత్రమే భూమి ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ఎన్ని ఎకరాల భూమి కొనాలి’ అని వ్యంగ్యంగా చెప్పడం దళితుల పట్ల కేసీఆర్‌‌‌‌‌‌‌‌కున్న వ్యతిరేకతను స్పష్టం
చేస్తోందని ఫైర్ అయ్యారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దళితద్రోహి..

ఏడాదికి 15 శాతం ఎస్సీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ కింద, 10 శాతం ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ కింద నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఎస్సీలకు డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు ఇస్తానని ఆశ కల్పించారని తెలిపారు. ఇలా ఎన్నికల టైమ్​లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని గెలిచిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చినంక ఇచ్చిన హామీలు మర్చిపోయిండని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అబద్ధాలకోరు, దళితద్రోహి అని.. దళితులపట్ల తనకున్న వ్యతిరేకతతోనే ఎస్సీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధులను ఎస్సీ డివిజన్లలో ఖర్చు చేయకుండా చట్ట వ్యతిరేకంగా పక్కదారి పట్టించి ఇతర డివిజన్లలో ఖర్చు చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన వెంట బీజేపీ కార్పొరేటర్లు కౌశిక లత, దుబాసి లలిత మల్లేశ్‌‌‌‌‌‌‌‌, కల్వల శిరీష్ సంజీవ్‌‌‌‌‌‌‌‌, నాయకులు కౌశిక హరి, పెద్దపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌, రాచకొండ కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రామ మందిరం నిర్మాణంలో భాగస్వాములు కావాలి

అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వివేక్ వెంకటస్వామి కోరారు. కాటారం, మహాముత్తారం, మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణలో ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్​గా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి చందాలు సేకరించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రామ మందిరం కట్టడానికి విరాళాలు ఇచ్చేందుకు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని, ప్రజల సపోర్ట్ చాలా బాగుందని తెలిపారు.  400 ఏండ్ల తర్వాత రాముని గుడి కట్టడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుడి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమన్నారు. గుడి నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్యలో రాముని గుడి కట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా చందాలు సేకరిస్తుంటే దీన్ని కూడా తప్పుపట్టిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు, నాయకులవి నీతిమాలిన కామెంట్లని వివేక్
మండిపడ్డారు.

బీజేపీలో  భారీగా చేరికలు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి గట్టిపట్టున్న ధన్వాడలో ఆ పార్టీ కార్యకర్తలు చాలా మంది బీజేపీలో చేరారు. వారిని వివేక్​ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేంధర్, బానోతు జగన్ నాయక్, వెన్నంపల్లి పాపయ్య, శశికుమార్‌‌‌‌‌‌‌‌, రంజిత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, బొమ్మన భాస్కర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.