దేశ చరిత్రలో సంజీవయ్యది చెరగని స్థానం

దేశ చరిత్రలో సంజీవయ్యది చెరగని స్థానం

భారతదేశ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యది చెరగని స్థానమని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సంజీవయ్యది 100వ జయంతి. ఈ సందర్భంగా సంజీవయ్య పార్క్‌లో దామోదర్ సంజీవయ్య 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పనిచేశారు. ఈ వేడుకలలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొని.. సంజీవయ్య ఘాట్ వద్ద నివాలు అర్పించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానమని వివేక్ అన్నారు. ‘
నీతి, నిజాయితీకి నిలువుటద్దం సంజీవయ్య. ఆయన పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా.. ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య. పేద ప్రజల కోసం సంజీవయ్య అనేక సేవలు చేశారు’ అని వివేక్ అన్నారు.

For More News..

జూబ్లీహిల్స్‌‌లో ఇల్లు కోసం రూ.41 కోట్లు

క్యాచ్​కు అప్పీల్​ చేస్తే ఎల్బీకి రివ్యూ చేసిండు

ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం