కరీంనగర్ రూరల్, వెలుగు : కరీంనగర్ రూరల్ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఆయకట్టు చివరి దాకా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ముగ్ధుంపూర్ గ్రామంలోని రాజీవ్ రహదారిపై బీజేపీ లీడర్లు, రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ డీ-89, డీ-94, 3ఎల్ కాలువల ద్వారా 600
క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ఇందులో సగం కూడా ఇవ్వకుండా సాగునీరుస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఆందోళనతో కరీంనగర్, రామగుండం హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయి. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, లీడర్లు సుధాకర్, తిరుపతి, నరేందర్, మల్లన్న, రైతులు పాల్గొన్నారు.