కరీంనగర్ సిటీ, వెలుగు: కొత్తపల్లిలో ఈద్గాకు కేటాయించిన 8 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకొవాలని బీజేపీ నేతలు బాస సత్యనారాయణ రావు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలో రైతులు ఐకేపీ సెంటర్ కు 5 ఎకరాలు కావాలని ఏడాదిగా కోరుతున్నా మంత్రి గంగుల కమలాకర్ పెడచెవిన పెట్టారన్నారు.
రైతులు,పేదల ఇండ్ల అవసరాల కు వినియోగించాల్సిన ప్రభుత్వ భూమిని , ఓ వర్గ మత ఓట్ల కోసం వినియోగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ , జిల్లా అధికార ప్రతినిధులు కల్యాణ్, స్వామి, రమేశ్, సంపత్, సుధాకర్, లోకేశ్, సంపత్ పాల్గొన్నారు.