
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది.
బీఆర్ఎస్ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మహేశ్వరం నియోజవర్గం జిల్లెలగూడలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడికి నిర్ణయించారు.
ఇవాళ ఉదయాన్నే భారీ సంఖ్యలో నేతలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలో మీర్పేట్సీఐ కిరణ్కుమార్ కింద పడిపోయారు.
పోలీసులు బలవంతంగా నిరసనకారుల్ని వాహనాల్లో ఎక్కించి పోలీస్స్టేషన్లకు తరలించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆపేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.