దుబ్బాక, వెలుగు: ఎనిమిదేండ్లుగా గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా భూంపల్లి- అక్బర్పేట మండల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ఇండ్ల సమస్యను పరిష్కరించాలని, గ్రామంలో దళితబంధు పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంపీకి ప్రోటోకాల్ తెలియదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే లేకుండా అంగన్వాడీ కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. ఎంపీని అడ్డుకున్న బీజేపీ లీడర్లు బాలిశెట్టి శ్రీనివాస్‌గౌడ్, నరేశ్, శ్రీకర్, లింగం గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నిస్తే పోలీస్‌లు అరెస్ట్ చేయడమేంటని లీడర్లు ప్రశ్నించారు. ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు.