ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేద్దాం : బీజేపీ నేతలు

మరికల్/వనపర్తి టౌన్/అలంపూర్, వెలుగు: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. మరికల్, వనపర్తి, అలంపూర్​లో సోమవారం హర్​ఘర్​ తిరంగా యాత్రలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. 

మరికల్​లో మానవహారం ఏర్పాటు చేసి జాతీయగీతాన్ని ఆలపించారు. వనపర్తిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. అలంపూర్  చౌరస్తాలో విద్యార్థులతో కలిసి బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.