నిర్మల్/కోల్బెల్ట్/దహెగాం/నస్పూర్, వెలుగు: ప్రతి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం దహేగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శీనివాస్, ఎన్నికల జిల్లా ఇన్చార్జి, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నస్పూర్లో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, నిర్మల్ ల్లో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, మందమర్రి మండల రూరల్ ప్రెసిడెంట్పైడిమల్ల నర్సింగ్ మాట్లాడారు.
అన్ని వర్గాల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయా చోట్ల ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.