ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలి

ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్​ విడుదలవ్వగానే పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇచ్చి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్​ఉపాధ్యాయులు, పట్టభద్రులను కోరారు. గురువారం ఆదిలాబాద్​లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిలదీసే పాలకపక్షం దృష్టికి తీసుకెళ్లే నేతలను బీజేపీ గుర్తించి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. 

అంతకు ముందు ఉదయం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వాకర్స్​ను కలిసి ప్రచారం చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యను, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్న, దారట్ల జీవన్, రత్నాకర్ రెడ్డి, విజయ్, మయూర్ తదితరులు పాల్గొన్నారు.