మునుగోడు బైపోల్ : కారులో మద్యం పట్టుకున్న బీజేపీ నేతలు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్కు సమయం ఉన్నా.. ఇంకా ఓటర్ల ప్రలోభాలు కొనసాగుతున్నాయి.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో బీజేపీ నేతలు మద్యం పట్టుకున్నారు. ఈ గ్రామానికి టీఆర్ఎస్ ఇంచార్జ్గా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు మద్యం, పైసలు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి. 2 గంటల్లో 20 శాతం పోలింగ్ పెరిగింది. పోలింగ్ సరళి ఉదయం కాస్త మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి పుంజుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.