పీఎం మోదీ, ఎంపీ అర్వింద్ ఫొటోలకు క్షీరాభిషేకం

మెట్‌‌పల్లి/జగిత్యాల రూరల్‌‌/కోరుట్ల, మల్లాపూర్‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన పీఎం నరేంద్ర మోదీ, బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ అర్వింద్ ఫొటోలకు పలువురు బీజేపీ లీడర్లు క్షీరాభిషేకం చేశారు. మెట్‌‌పల్లిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేశ్‌‌, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మీనా, తదితరులు పాల్గొన్నారు. కోరుట్లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్​కుమార్​మాట్లాడుతూ నిజామాబాద్‌‌ పసుపు బోర్డు కలను మోదీ సాకారం చేశారన్నారు. 

మల్లాపూర్‌‌‌‌లో మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీఎం మోదీ, ఎంపీ అర్వింద్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. జగిత్యాలలో తహసీల్‌‌ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్‌‌ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాతి కానుకగా మోదీ సర్కార్ నిజామాబాద్‌‌ పార్లమెంట్‌‌ రైతులకు పసుపు బోర్డు అందించారన్నారు.