- పాదయాత్రలో బీజేపీ లీడర్లు
జీడిమెట్ల, వెలుగు: గాజులరామారం డివిజన్పరిధిలోని కైసర్నగర్ ను దత్తత తీసుకుంటానని ఎన్నికల్లో ఇచ్చిన హమీని ఎమ్మెల్యే వివేకానంద మరిచారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. కైసర్నగర్లో ఆదివారం నిజాంపేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ ఆధ్వర్యంలో లీడర్లు సమస్యలపై పాదయాత్ర చేశారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎల్లమ్మ గుడిలో కూర్చొని కైసర్నగర్దత్తతకు తీసుకుంటానని హమీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ మాట మర్చిపోయాడన్నారు. 1000 కుటుంబాలుండే బస్తీలో తాగునీరు,డ్రైనేజ్, కరెంట్లాంటి కనీస వసతులులేవన్నారు. ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లీడర్లు జయశంకర్ గౌడ్, చందు, అరుణ్రావు, ముఖేశ్, మురళి పాల్గొన్నారు.