ఎంపీ దయాకర్ కనబడట్లేదు.. మిల్స్ కాలనీ పోలీసులకు బీజేపీ లీడర్ల ఫిర్యాదు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంపీ, బీఆర్​ఎస్​లీడర్​ఎంపీ పసునూరి దయాకర్  కొన్నేండ్ల నుంచి కనిపించట్లేదంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ తూర్పు నియోజకవర్గ లీడర్​కుపుమ సతీశ్​ఆదివారం వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. 

అయన మాట్లాడుతూ వారం రోజులుగా గ్రేటర్ వరంగల్ ప్రజలు అధిక వర్షాలు, వరద ఉధృతిలో చిక్కుకుని విలవిలలాడుతుంటే ఎంపీ రాకపోయేసరికి ఫిర్యాదు చేశామన్నారు. వరంగల్​ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్,ఇనుముల అరుణ్, మాచర్ల రవీందర్, చిన్నారావు, ఓం ప్రకాష్ కొలారియా పాల్గొన్నారు.