- ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి బీజేపీ నేతల యత్నం
నెట్‌వర్క్, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని బీజేపీ నేతలు విమర్శించారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇండ్లు, క్యాంప్ ఆఫీసుల ముట్టడికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకొని స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో నల్గొండలో పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. నకిరేకల్‌లో బీజేపీ నేతలను బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. ఇరువురి మధ్య తోపులాట జరగగా.. బీజేపీ నేతలకు గాయాలయ్యాయి.
అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు భూపంపిణీ, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తుండడంతో దళితబంధు, బీసీబంధు, మైనార్టీ బంధు పేరిట ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లతో పాటు గృహలక్ష్మి పథకం, కార్పొరేషన్ రుణాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు కంకణాల శ్రీధర్ రెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్ , గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కనుమంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, పోతేపాక సాంబయ్య, కంకణాల నివేదిత రెడ్డి , కొంపెల్లి శ్రీనివాస్, కడియం రామచంద్రయ్య, చనమల వెంకట్ రెడ్డి, కర్నాటి సురేశ్, చెనమోని రాములు, అంకూరి నర్సింహ్మ, ఏటీ కృష్ణ, వెంకటేశ్వర్లు, కనగాల నారాయణ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.