మున్సిపల్​ కమిషనర్​పై చర్యలు తీసుకోవాలి

మున్సిపల్​ కమిషనర్​పై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్​, వెలుగు :  సీఎం పిటిషన్ పై తప్పుడు రిపోర్ట్​ ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్​ కమిషనర్ రాజు పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్​ మున్సిపల్​ఆఫీస్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేసి కమిషనర్​ గదికి మెమోరాండం అంటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి,  టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ అవినీతి అక్రమాలపై సీఎంవోకు ఫిర్యాదు చేశామన్నారు.  

144 అక్రమ ఇంటి నంబర్లు రద్దు చేశామని రిపోర్ట్​ లో పేర్కొన్న మున్సిపల్​ కమిషనర్​ ఆ ఇంటి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్ స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుని ఇంతవరకు మున్సిపల్ కు రాలేదన్నారు.  కార్యక్రమంలో  జెస్సు అనిల్​కుమార్​, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, ఆరె రాజేశ్వర్, ద్యాగ ఉదయ్​, పాన్​ శ్రీను తదితరులు పాల్గొన్నారు.