లింగంపేట, వెలుగు : లింగంపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ షౌకత్అలీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేరెంట్స్, బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, డీఈవోతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైస్కూల్‌లో ఉన్న సరస్వతీ విగ్రహానికి స్టూడెంట్లు
టీచర్లు ప్రతి శుక్రవారం పూజలు చేయడాన్ని హెచ్‌ఎం జీర్జించుకోలేకపోతున్నారని ఆరోపించారు. సరస్వతీ విగ్రహానికి పూజలు చేయవద్దని కోరుతూ స్కూల్ టీచర్లకు వాట్సప్గ్రూప్లో మెస్సేజ్ పెట్టారని మండిపడ్డారు. హెచ్‌ఎంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.