
సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు నామినేషన్ ను అధికారులు వెంటనే తిరస్కరించాలని ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ తన కుటుంబ సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారని, అఫిడవిట్లో అతని కుమారుడి వివ రాలు ఇవ్వలేదని ఆరోపించారు. అతనిపై అక్రమ ఆస్తులు ఉన్నందుకే పేరు పెట్టలేదా? లేదా ఆయనకు ఇండియా పౌరసత్వం లేదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే, కేసుల వివరాలూ సీక్రెట్‌గా ఉంచారన్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవల్లో నమోదైన కేసు వివరాలను అఫిడవిట్లో పెట్టలేదని ఆయన ఆరోపించారు.