మున్సిపల్​ కమిషనర్ ను సస్సెండ్ చేయాలె.. బీజేపీ లీడర్ల డిమాండ్

ఆర్మూర్, వెలుగు: అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్న ఆర్మూర్ మున్సిపల్​కమిషనర్​ ప్రసాద్ చౌహాన్ ను సస్పెండ్ చేయలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ​వైఖరికి నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ లో బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి,  ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడారు. అంగడి బజార్ మార్కెట్ యార్డ్ లో హరితహారంలో నాటాల్సిన మొక్కల విషయమై ప్రశ్నిస్తే, తెల్లారేసరికి మొక్కలను వేరే చోట పారేశారన్నారు. ఆ మొక్కలను నాటి ఉంటే వివరాలు చెప్పాలని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశీర్వాద సభ సందర్భంగా బీఆర్ఎస్ లీడర్లు నిబంధనలు ఉల్లంఘించి డివైడర్లు, స్తంభాలు, కరెంట్ పోల్స్ కు గులాబీ రంగులు వేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని కమిషనర్​ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. నిరసనలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ద్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్​నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, పులి యుగంధర్, గుగులోత్ తిరుపతి నాయక్, యాల్ల రాజ్ కుమార్, బాశెట్టి రాజ్ కుమార్ పాల్గొన్నారు.