- ఉమ్మడి జిల్లాలో అధికారులకు బీజేపీ నేతల వినతి
కరీంనగర్ సిటీ/కొత్తపల్లి/వేములవాడ/సైదాపూర్/బోయినిపల్లి/కోనరావుపేట/చందుర్తి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ లీడర్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
గంగాధర, కొత్తపల్లి మండలాల్లో పార్లమెంట్ కన్వీనర్ బి.ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. వేములవాడలో ఆర్డీవో రాజేశ్వర్‌కు, సైదాపూర్, కోనరావుపేట, మల్యాల, చందుర్తి బోయినిపల్లి మండలాల్లో ఆయా తహసీల్దార్లకు బీజేపీ లీడర్లు వినతిపత్రాలు సమర్పించారు.