నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ లీడర్ల ధర్నా

–  ఆగి ఉన్న వెహికల్స్​ చెక్​ చేయడాన్ని నిరసిస్తూ లీడర్ల ధర్నా
– పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఫైర్​


సంస్థాన్ నారాయణ పురం : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్ట్ ల వద్ద బీజేపీ లీడర్ల వెహికల్స్​ను మాత్రమే చెక్ చేస్తున్నారని, టీఆర్ఎస్ లీడర్ల వెహికల్స్​ను తనిఖీ చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపిస్తూ.. నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ లీడర్లు మంగళవారం ధర్నాకు దిగారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు దోనూరి వీరారెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నారాయణపురం మండలంలో ఉదయం నుంచి ప్రచారం చేసి వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు పక్కన కారును ఆపితే ఆగి ఉన్న కారును పోలీసులు చెక్​చేయడం దుర్మార్గమన్నారు.

ఆగి ఉన్న కారును ఎలా చెక్ ​చేస్తారని బీజేపీ లీడర్లు పోలీసులను ప్రశ్నించగా.. తమను ప్రశ్నించవద్దని దబాయించడంతో  బీజేపీ లీడర్లు  రోడ్డుపై ధర్నా చేపట్టారు. బీజేపీ లీడర్​వీరారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్​మంత్రులు, వారి అనుచరుల కార్లలో మద్యం, డబ్బులు సప్లై చేస్తుంటే  పోలీసులు చూస్తూ వదిలేస్తున్నారని ఆరోపించారు. వారికి పోలీసులు ఏజెంట్లు గా పని చేస్తున్నారని   మండిపడ్డారు.