ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి రాబోతున్న మంత్రి కేటీఆర్ ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు.
కేటీఆర్ ఉప్పల్ ని అభివృద్ధికి కృషి చేయడం లేదు కానీ, ప్రారంభోత్సవానికి ఎందుకు వస్తున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ రామాంతాపూర్ ను దత్తత తీసుకుంటానని.. ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఉప్పల్ పరిధిలో ఒక్క పేదవాదవాడికి కూడా న్యాయం జరగలేదని విమర్శించారు. అన్ని అర్హతలు ఉన్నా కూడా దళిత బంధు ఇవ్వాలంటే అధికారులు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. కులం సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా లంచం అడుగుతున్నారని బీజేపీ నాయులు మండిపడ్డారు.