అంబేద్కర్ విగ్రహాలను శుద్ధ చేసే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

అంబేద్కర్ విగ్రహాలను శుద్ధ చేసే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

నిజామాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్​ఢిల్లీలో మరో సెంట్రల్​మినిస్టర్​అమిత్​షా చెప్పులు మోసే డ్యూటీ చేస్తున్నాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్​కు రాజ్యాంగంపై ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. సోమవారం ఆయన నిజామాబాద్​రూరల్​సెగ్మెంట్​పరిధి కాలూరు విలేజ్​లో అంబేద్కర్​ విగ్రహానికి పూల మాలలు వేసి జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ​ప్రొగ్రామ్​లో ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.

 అమిత్​షా పార్లమెంట్​సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ను అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు దద్దమ్మల్లా సైలెంట్​గా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ బుద్ధి అప్పుడు ఎటుపోయిందని ఫైర్ అయ్యారు.  అంబేద్కర్​ను అవమానించిన అమిత్​షాతో క్షమాపణలు చెప్పించకుండా ఆయన విగ్రహాన్ని శుద్ధి చేసే నైతిక హక్కు బీజేపీ లీడర్లకు లేదన్నారు. దేశంలో అంబేద్కర్​ఆశయాలను మోస్తున్న   నేత రాహుల్​ గాంధీ ఒక్కరేనన్నారు. 

ఆయన నాయకత్వంలో తెలంగాణ సర్కార్​ బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ బిల్లు పాస్​ చేసిందని, ఎస్సీ రిజర్వేషన్​నిర్ణయిం తీసుకుందన్నారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. ఆయనవెంట స్టేట్​ కో ఆపరేటివ్​ డెవలప్​మెంట్​ లిమిటెడ్​ చైర్మన్​మానాల మోహన్​రెడ్డి, మార్కెట్​కమిటీ చైర్మన్​ముప్ప గంగారెడ్డి, శేఖర్​గౌడ్​ తదితరులు ఉన్నారు.