హైదరాబాద్ : GHMCలో TRS ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇండ్లిస్తామని మోసం చేశారన్నారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యాక్షురాలు DK అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, OBC జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, MLC రాంచందర్ రావు, మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో GHMC, MLC ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు బీజేపీ లీడర్లు. దుబ్బాక ఉప ఎన్నికపైనా రివ్యూ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ వచ్చిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేలా పని చేయాలని నిర్ణయించారు. సన్న రకం వడ్లను 2 వేల 500 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.