- అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా కొనసాగిన బండి సంజయ్ పర్యటన
గద్వాల, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో సంతాప దినాలు ఉన్నాయని, ఇలాంటి టైమ్లో ఏమి మాట్లాడలేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఆయన పర్యటన సాగింది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి వచ్చిన ఆయనకు నందిన్నే దగ్గర బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఎంపీ డీకే అరుణ నివాసానికి చేరుకోగా.. డీకే స్నిగ్ధా రెడ్డి, పార్టీ నాయకులు సాదరంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం డీకే బంగ్లాలో బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. .
పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, రజక నరసింహులు, బలిగేర శివారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకటరాములు, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణవేణి, త్యాగరాజ్, కుమ్మరి శీను, బండల పాండు, రజక జయశ్రీ ఉన్నారు.
గద్వాల అభివృద్ధికి సహకరించండి..
గద్వాల అభివృద్ధికి సహకరించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోరారు. శుక్రవారం కర్ణాటకలోని రాయచూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. గద్వాలకు నవోదయ, సైనిక్ స్కూల్ తో పాటు ట్రామా కేర్ సెంటర్ ను మంజూరు చేయాలని కోరారు. గద్వాల–రాయచూర్ 4 లేన్ల రహదారి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.