రాష్ట్రపతిని అవమానించారు.. కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ విమర్శలు

రాష్ట్రపతిని అవమానించారు.. కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కనీసం నమస్కారం కూడా చేయకుండా ఆమెను అవమానించారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 

కాగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, ప్రధాని, కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సభ్యులంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నమస్కారం చెప్తుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఆమెకు కనీసం నమస్కారం చెప్పకుండా ఆమెను నిర్లక్ష్యం చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

రాష్ట్రపతి ఓ గిరిజన నాయకురాలైనందుకే ఆమెను లెక్కచేయలేదని బీజేపీ నేత అమిత్ మాల్వియా.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి యువరాజు? అయినా ఇలాంటి చీప్ మెంటాలిటీ ఏంటి? అని ప్రశ్నించారు.

 పలువురు బీజేపీ నేతలు ఈ ఘటనతో రాహుల్ పై మండిపడుతున్నారు.