‘మునుగోడు సమరభేరి’కి సర్వం సిద్ధం

నల్గొండ: మునుగోడులో రేపటి అమిత్ షా సభకు సర్వం సిద్దమైంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు కమలం నేతలు. సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. రేపటి కార్యక్రమానికి ‘మునుగోడు సమరభేరి’గా పేరు పెట్టింది బీజేపీ. అమిత్ షా రేపు మధ్యాహ్నం 3 గంటల 40నిమిషాలకి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి 4 గంటల 50 నిమిషాల నుంచి 6 గంటల వరకు మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో జాయిన్ అవుతారు. అనంతరం సాయంత్రం 6:45 నుంచి 7:30 గంటల వరకు అమిత్ షా రామోజీ ఫిలిం సీటిలో గడపనున్నారు. తర్వాత రాత్రి 8 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. బై పోల్ గురించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాత్రి 9: 40 గంటలకు అమిత్ షా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.