ఆందోళనలో పాల్గొన్నాడని బీజేపీ లీడర్​ ఇల్లు కూల్చివేత

  • గుర్రంపోడు ఆందోళనలో పాల్గొన్నాడని కక్షసాధింపు
  • కోదాడ మున్సిపాలిటీ ఎదుట ధర్నా

గిరిజనులకు అండగా నిలబడిన లీడర్లపై ప్రభుత్వం కక్షగట్టింది. కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా.. వాళ్ల ఇండ్లు కూల్చేందుకూ సిద్ధపడింది.  బీజేపీ చేపట్టిన సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు గిరిజన భరోసా యాత్రలో యాక్టివ్​గా పాల్గొన్న బీజే‌పీ స్టేట్​ లీడర్​ ఓర్సు వేలంగి రాజు ఇంటిని కోదాడలో మున్సిపల్ ఆఫీసర్లు సోమవారం కూల్చివేశారు. దీన్ని నిరసిస్తూ మున్సిపాలిటీ ముందు బీజేపీ లీడర్లు ధర్నా చేపట్టారు.

సూర్యాపేట వెలుగు: మఠంపల్లి మండలం గుర్రం పోడు భూముల వ్యవహారంలో బీజేపీ నాయకుల మీద సర్కారు కక్ష సాధించడం మొదలుపెట్టింది. గిరిజనులకు అండగా నిలబడిన లీడర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపడమే కాక.. ఇంటి ముందుభాగాన్ని  కూల్చివేసేందుకు సిద్దపడింది. బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ బండి సంజయ్ చేపట్టిన గుర్రంపోడు యాత్రలో  యాక్టివ్​గా పాల్గొన్న బీజే‌పీ స్టేట్​ లీడర్ ​ఓర్సు వేలంగి రాజు ఇంటి ముందు భాగాన్ని కోదాడ మున్సిపల్ ఆఫీసర్లు సోమవారం కూల్చివేశారు.

రాజకీయ కక్ష సాధింపే.. 

కోదాడ అనంతగిరి రోడ్ లోని పబ్లిక్ క్లబ్ ఎదురుగా రాజు తన మూడు అంతస్తుల బిల్డింగ్ కోసం ఆరునెలల కిందటే  మున్సిపాలిటీ నుంచి పర్మిషన్​ తీసుకున్నారు. రూల్స్​కు విరుద్ధంగా కట్టారంటూ సోమవారం  మున్సిపల్ అధికారులు జేసీబీ తో బిల్డింగ్ ముందు భాగాన్ని కూల్చివేశారు. రాజును వారం కిందట అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయన జైలులో ఉండగానే.. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒత్తిడితో ఆఫీసర్లు కూల్చివేశారని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు.దీనిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్, జాతీయ బీసీ కమిషన్ కు కంప్లయింట్​ చేయనున్నట్టు చెప్పారు. నిబంధనలను అతిక్రమించి కట్టిన బిల్డింగ్ ముందుభాగాన్ని  మాత్రమే కూల్చివేశామని కోదాడ మున్సిపల్​ కమిషనర్​ మల్లారెడ్డి తెలిపారు.

మున్సిపాలిటీ ఎదుట బీజేపీ ధర్నా

కోదాడ: వేలంగిరాజు ఇంటిని కూల్చివేయడాన్ని నిరసిస్తూ కోదాడ మున్సిపాలిటీ ముందు బీజేపీ నేతలు ధర్నా చేశారు. పర్మిషన్​ తీసుకునే కట్టినా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఒత్తిడితో కూల్చివేతలకు  దిగారని ఆరోపించారు. గుర్రంపోడు తండా సంఘటనలో రాజును అక్రమంగా అరెస్ట్‌‌ చేశారని, తాజాగా అతనిపై కక్ష సాధించేందుకు బిల్డింగ్‌‌ను కూల్చివేశారని బీజేపీ స్టేట్​లీడర్లు  కనగాల  వెంకట్రామయ్య, నూనె సులోచన, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు  యశ్వంత్‌‌ అన్నారు. అనంతరం అనుమతి పత్రాలను మున్సిపల్‌‌ మేనేజర్‌‌
అంకుషావలీకి అందజేశారు.

For More News..

జీవోలు ఇచ్చి.. చెత్తబుట్టలో వేస్తరా?