బీజేపీ మేనిఫెస్టో చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: కేసీఆర్ కు బీజేపీ భయం బాగా పట్టుకుందని.. దుబ్బాకలో మాదిరిగా ఓటమి భయంతో.. బీజేపీ నేతల ఇండ్లలో సోదాలు చేయిస్తున్నాడని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కేసీఆర్ భయపడినట్లే దుబ్బాక రిజల్టే గ్రేటర్ లో కూడా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బన్సీలాల్ పెట్ డివిజన్ లో బీజేపీ చేపట్టిన ఇంటింటి ప్రచారం లో బీజేపీ మేనిఫెస్టో చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బన్సీలాల్ పెట్ డివిజన్ లో 147 వార్డ్ బీజేపీ అభ్యర్థి స్పందన కు మద్దతుగా వివేక్ వెంకటస్వామి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టో కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజల అవసరాలను మేనిఫెస్టోలో పెట్టారని ప్రజలు అంటున్నారని.. అందుకే తాము ప్రజా నాడికి అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేశామన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు, 25 వేల వరద సాయం, ఉచితంగా కారోనా వ్యాక్సిన్, పేద పిల్లలకు లాప్ టాప్ లు ఇస్తామని మేనిఫెస్టో లో చెప్పామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వలేదు కానీ…ఫామ్ హౌస్ లయితే కట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ బీజేపీని చూస్తే భయపడుతున్నాడు… అందుకే దుబ్బాక ఎన్నికల్లో మాదిరి కమిషనర్లతో బీజేపీ నేతల ఇండ్ల లో సోదాలు చేయిస్తున్నాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దుబ్బాక రిజల్ట్ టే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కేసిఆర్ కు తగిన బుద్ది చెబుతామని ఆయన పేర్కొన్నారు.
Read More News….