కేంద్ర సహాయ మంత్రిని కలిసిన బీజేపీ లీడర్లు 

కేంద్ర సహాయ మంత్రిని కలిసిన బీజేపీ లీడర్లు 

కోరుట్ల/ తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరుట్ల, తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాలకు చెందిన బీజేపీ లీడర్లు ఢిల్లీలో శుక్రవారం కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిసాన్​మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్​రెడ్డి, కోరుట్ల మున్సిపల్​ కౌన్సిలర్​ పెండెం గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పలు మండలాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆయనను సన్మానించారు. కలిసిన వారిలో జీడీ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంగిశెట్టి రాజు, సుగుర్తి జగదీశ్వరాచారి, రాపాక ప్రవీణ్, కందుల శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, పైడిపల్లి శ్రీనివాస్, కట్కూరి అశోక్ రెడ్డి, లీడర్లు ఉన్నారు.