కోరుట్ల, వెలుగు: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ను జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన బీజేపీ లీడర్లు సోమవారం కలిశారు. హర్యానా రాజ్‌భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ను కలిసి సన్మానించారు.
గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ , సీనియర్ నాయకులు వినోదరెడ్డి, కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ పెండెం గణేష్ ఉన్నారు.