ఆదిలాబాద్ టౌన్, వెలుగు: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తరలివెళ్లారు. అయోధ్య వెళ్లే ప్రత్యేక వాహనాలకు పార్టీ జిల్లా కార్యదర్శి వకుళాభరణం ఆదినాథ్ పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు.
బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో 500 ఏండ్ల నాటి హిందువుల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా జిల్లా నుంచి 13 వేల మంది భక్తులు బాలరాముడి దర్శనానికి వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.