మెట్ పల్లి, మల్లాపూర్, జగిత్యాల టౌన్ : దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఎదురుచూసిన రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ తీపి కబురు చెప్పారని బీజేపీ లీడర్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పలు పట్టణాలు, మండలకేంద్రాల్లో రైతులు, బీజేపీ లీడర్లు మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మల్లాపూర్మండలంలో రైతులు, లీడర్లు పటాకులు కాల్చారు. జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ ఫొటోలకు పసుపు నీటితో అభిషేకం చేశారు.