
బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూముల్ని అమ్మకాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఇటీవల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.వందల కోట్ల విలువైన భూముల్ని వేలం వేశారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆగస్టు 6న కోకాపేట చేరుకున్నారు.
వారిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు వారిని స్టేషన్కి తరలించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ పెంచారు.