
సీఎం కేసీఆర్ మెదక్పర్యటన వేళ జిల్లా కేంద్రంలో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఉదయాన్నే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు.
అర్హులకు డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన కారులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. డీఎస్పీ ఫనీంద్ర తమను దూషించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.