వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ముందు బీజేపీ నేతల నిరసన

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే పోలీసులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎంజీఎం ముందు ఆందోళనకు దిగారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలపూర్లో నిన్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోగా.. బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణకు సంబంధించి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.