చెత్త తెచ్చి మున్సిపల్ ఆఫీసు ముందు డంపింగ్

చెత్త తెచ్చి మున్సిపల్ ఆఫీసు ముందు డంపింగ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీ లోక్ సభ ఇన్ చార్జ్  అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ రావుల రామనాథ్, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, పలువురు నేతలు, కార్యకర్తలు బుధవారం టౌన్ లో నాలుగైదు గంటల పాటు తిరుగుతూ మెయిన్ ఏరియాల్లో చెత్త సేకరణ చేపట్టారు. ట్రాక్టర్ లో తెచ్చి మున్సిపల్ ఆఫీస్ వద్ద రోడ్డుపై డంప్ చేసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ వెంటనే పారిశుధ్య  కార్మికులకు వేతనాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  కార్మికుల సమ్మెకు మొదటి నుంచి బీజేపీ మద్దతు పలుకుతుంది. ఇందులో భాగంగానే వినూత్నంగా నిరసన తెలిపింది.